బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్నప్పటి నుండి గుజరాతీ బ్యూటీ మోనల్ గజ్జర్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ రియాలిటీ షోకి ముందుగా తెలుగులో సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, వెన్నెల 1 1/2 వంటి చిత్రాలలో నటించినా.. మోనల్ గజ్జర్‌కి అంత పేరు రాలేదు. బిగ్ బాస్ హౌజ్‌లో తన అందంతో, అభినయంతో 98 రోజులపాటు ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన మోనల్ గజ్జర్‌కి బిగ్ బాస్ బ్యూటీగా అమాంతం పాపులారిటీ పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక మోనల్‌కి తెలుగు పరిశ్రమలో బంపర్ ఆఫర్లు మొదలయ్యాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం మా టీవీలో డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్ నటిస్తోన్న అల్లుడు అదుర్స్ సినిమాలో ( Alludu Adhurs movie ) స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.


Also read : Monal Gajjar: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మోనాల్ డిమాండ్ మామూలుగా లేదుగా


దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు మోనల్ గజ్జర్ కూడా టాలీవుడ్‌లో క్యూ కడుతున్న ఆఫర్స్‌పైనే దృష్టి సారించింది. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్‌తో వచ్చిన ఫేమ్‌ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడి, టాలీవుడ్‌లో ( Tollywood ) అవకాశాలను అన్వేషించడానికి మోనల్ యోచిస్తున్నట్లు సమాచారం. 


ప్రస్తుతం బాలీవుడ్‌తో సహా ఇతర భాషా చిత్ర నిర్మాతలు కూడా మోనల్‌ గజ్జర్‌ను ( Monal Gajjar ) సంప్రదిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇదిలావుంటే, ఇటీవలే విడుదలైన మోనల్ గజ్జర్ లేటెస్ట్ హిందీ మూవీ 'కాగజ్'కు మంచి స్పందన లభిస్తోంది.


Also read :  KGF Chapter 2 Teaser: కేక పుట్టిస్తున్న కేజీఎఫ్ 2 మూవీ టీజర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook